పెన్షన్లపై జగన్ అబద్ధాలు చెబుతున్నారు: కొండపల్లి శ్రీనివాస్

  • 6 లక్షల పెన్షన్లు తీసేశారంటూ జగన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారన్న శ్రీనివాస్
  • జగన్ ప్రభుత్వమే 11 లక్షల పెన్షన్లు తొలగించిందని ఆరోపణ
  • పెన్షన్ల కోసం 22 నెలల్లో రూ. 63,157 కోట్లు ఖర్చు చేశామని వెల్లడి

పెన్షన్ల తొలగింపుపై వైసీపీ అధినేత జగన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో 6 లక్షల పెన్షన్లు తీసేశారనడం పచ్చి అబద్ధమని, నిజానికి జగన్ ప్రభుత్వమే ఐదేళ్లలో 11 లక్షల మంది నిరుపేదల పెన్షన్లను నిర్దాక్షిణ్యంగా తొలగించిందని ఆరోపించారు. మృతిచెందిన వారి పెన్షన్లు మాత్రమే కూటమి ప్రభుత్వంలో రద్దయ్యాయని, పైగా గడిచిన 22 నెలల్లో కొత్తగా 2.50 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేశామని స్పష్టం చేశారు. 


జగన్ ఐదేళ్ల పాలనలో పెన్షన్ల కోసం రూ. 91 వేల కోట్లు ఖర్చు చేస్తే.. కూటమి ప్రభుత్వం కేవలం 22 నెలల్లోనే రికార్డు స్థాయిలో రూ. 63,157 కోట్లు ఖర్చు చేసిందన్నారు. జగన్ అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని మంత్రి పేర్కొన్నారు.


Kondapalli Srinivas
Andhra Pradesh pensions
Jagan Mohan Reddy
Pension scheme
Pension removals
Chandrababu Naidu
TDP government
YSRCP
AP government schemes

More Telugu News